బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గించుకోవచ్చని చాలా మంది ఇప్పటికే రుజువు చేశారు. మనం సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినపుడు భారీ లగేజీ (Luggage)ని తీసుకెళ్తుంటాం. వాటిని మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. బైక్ మీద వెళ్తే లగేజీ పెట్టడానికి స్థలం ఉండదని, కార్లు, ఆటోలు బుక్ చేస్తుంటాం. అయితే ఓ యువకుడు లగేజీ ట్రాలీ బ్యాగ్‌లను (Trolley bags) బైక్‌పై తీసుకెళ్లడానికి చాలా సులభమైన మార్గం కనిపెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో, బైక్ వెనుక ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఓ వ్యక్తి బైక్ (Bike) నడుపుతుండగా వెనుక కూర్చున్న వ్యక్తి తన భుజానికి ఒక బ్యాగ్‌ని తగిలించుకుని, రెండు చేతులతో రెండు ట్రాలీ బ్యాగ్‌లను పట్టుకున్నాడు. బైక్‌తో పాటు ఆ ట్రాలీ బ్యాగ్‌లు సునాయాసంగా ముందుకు వెళ్లిపోతున్నాయి. వెనుక కారులో వెళ్తున్న వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 4 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “ఈ టెక్నిక్ చాలా బాగుంది“, “ఆటోలో కూడా ఇంత లగేజీ తీసుకెళ్లడం కష్టమేమో“, “రోడ్లు బాగుంటే ఇది మంచి ఐడియా“, “ట్రాలీ చక్రాలు పాడైపోతాయి“ అని నెటిజన్లు కామెంట్లు చేశారు.
Spread the love స్త్రీ అంటే మాతృమూర్తి..ప్రతి స్త్రీ తన జీవితం లో తల్లి కావాలని కోరుకుంటుంది.జీవితం లో పెళ్లి తర్వాత తదుపరి వచ్చే ఘటనే గర్భం.గర్భం వస్తే స్త్రీ తను జీవితం లో […]
Spread the love వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే.. ప్రీతికి డిసెంబర్ నుంచి వేధింపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 20న అమ్మాయి […]
Spread the love మనసిచ్చి చూడు’ సీరియల్‌తో పేరు తెచ్చుకున్న కీర్తి.. ప్రస్తుతం ‘మధురానగరిలో ’సీరియల్ లీడ్ రోల్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్‌గా నిలిచింది. అయితే మొన్నటి వరకూ తాను […]