రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు (Traffic Cops) వాహనాలను చెక్ చేస్తున్నారంటే అటు వైపుగా వెళ్లడానికి చాలా మంది భయపడతారు. పోలీసులు వెళ్లిపోయే వరకు ఆగడమో, లేకపోతే వేరే రూట్‌లో వెళ్లడమో చేస్తారు. కొందరు పోలీసులకు
దొరికిపోయి రకరకాల కారణాలు చెబుతారు. అయితే ఓ యువతి రోడ్డుపై కారులో వెళుతూ పోలీసులకు దొరికిపోయి మహానటిలా నటించింది. రోడ్డుపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
ఆ వీడియోలో.. కొందరు అమ్మాయిలు ఓ కారులో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసు ఆపి పేపర్లు చూపించాలని అడిగాడు. దానికి ఆ కారును డ్రైవ్ చేస్తున్న యువతి చాలా సీరియస్ అయింది. గట్టిగా అరుస్తూ పేపర్లను తీసి
రోడ్డు మీద వేసింది. అనంతరం డోరు తెరిచి కిందకు దిగి రోడ్డు మీద కూర్చుని ఏడుపు మొదలుపెట్టింది (Girl breaks down on road). ఆమె చర్యకు పోలీసులు మాత్రమే కాదు.. ఆమె స్నేహితురాళ్లు కూడా షాక్ అయ్యారు. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోందోనని ఆశ్చర్యపోయారు. కొద్ది సేపటి తర్వాత పోలీసులు ఆమెను కారు ఎక్కి వెళ్లమని సూచించారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ అమ్మాయి నటన అద్భుతంగా ఉందని, పోలీసులను భయపెట్టడానికి ప్రయత్నిస్తోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.మీరు కూడా చూడండి
కారులో వెళ్తున్నా మహిళని ఆపేసిన పోలీసులు ఆతర్వాత కారు దిగి ఈ మహిళ చేసిన పనికి హడలిపోయిన పోలీసులు కింది ఈ వీడియో లో చూడండి
Spread the love వితమంటే, మీకంటే ‘అది వేరే’ అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. కానీ, జీవితమంటే మీరే! మీ ఆలోచనలు, ఉద్వేగాలు, భావాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, మతాలు, ఇష్టాయిష్టాలు అనే మబ్బులు, మీ జీవన […]
Spread the love పాము కనిపించగానే.. వామ్మో అంటూ.. ఆమడదూరం పరుగుపెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని.. కొందరు భయపడితే.. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి […]
Spread the love వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే.. ప్రీతికి డిసెంబర్ నుంచి వేధింపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 20న అమ్మాయి […]